మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
"మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి, దాన ధర్మ మతిగౌరవమంజులతాగభీరతా
స్థానికి, ముద్దుసానికి, సదాశివపాదయుగార్చనానుకం
పానయవాగ్భవానికిని, బమ్మెర కేసయ లక్కసానికిన్.
భావము:
లక్కమాంబ బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టే చల్లని తల్లి. ఔదార్యానికీ, బుద్థి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె పెట్టిందిపేరు. సదా, సదాశివుని పదాలు అర్చిస్తూ, దయతో కూడిన నయవాక్కులతో, సాక్షాత్తు భవానీమాతలా కనిపించే ఆ కేసయ గారి ధర్మపత్నికి సామాన్య కాంతలు సాటిరారు."
