నడవదు నిలయము వెలువడి
"నడవదు నిలయము వెలువడి
తడవదు పరపురుషు గుణముఁ దనపతి నుడువుం
గడవదు వితరణ కరుణలు
విడువదు లక్కాంబ విబుధ విసరము వొగడన్.
భావము:
ఆ లక్కమాంబ మహా యిల్లాలు. యింటి బయటకు కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలచుట ఎరుగదు. భర్త మాట జవదాటి ఎరుగదు. దాన ధర్మాలకు, దయా దాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననలను పొందిన మహా సాధ్వి."
