త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము

త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము

bookmark

"త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ డతనిఁ గోరి చింతించెద, 
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.

భావము:
ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో; ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో; ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవనియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగ అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను."