పుణ్యంబై, మునివల్లభ
"పుణ్యంబై, మునివల్లభ
గణ్యంబై, కుసుమ ఫల నికాయోత్థిత సా
ద్గుణ్యమయి నైమిశాఖ్యా
రణ్యంబు నుతింపఁ దగు నరణ్యంబులలోన్.
భావము:
పుష్పములు, ఫలములతో నిండిన నైమిశారణ్యం అరణ్యాలలోకెల్లా గొప్పదై అలరారుతుంటుంది. ఈ పుణ్యప్రదేశం తాపసోత్తములచే శ్రేష్ఠమైనదని కీర్తింపబడుతుంటుంది,"
