తొమ్మిదవ నెల వెన్నెల భోజనములు

తొమ్మిదవ నెల వెన్నెల భోజనములు

bookmark

తొమ్మిదవ నెల వెన్నెల భోజనములు:

చేయవలసిన వంటకాలు:
స్వీటు - పంచదారతో చక్కెర పొంగలి, కోవా, కాజు బర్ఫి, హల్వాపిండి ముక్కలు,గడ్డజున్ను, హల్వా, సగ్గుబియ్యం లేక సేమియా పరమాన్నము

హాటు - కొబ్బరి అన్నము, ఫ్రైడ్‌రైస్‌, కట్టె పొంగలి, దద్దోజనము

కూరలు - క్యాబేజి కూర, కాలీఫ్లవరు పసుపు లేకుండా వండవలెను.

చట్ని - కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ పెరుగు చట్ని

పులుసు - పెసరకట్టు పసుపు లేకుండ సగ్గుబియ్యం వడియాలు

ఓపెన్‌ స్థలములో భోజనములు ఏర్పాటు చేయాలి. మొదలు పెట్టినాక ఒకసారి లైటు ఆపిన ఎడల చంద్రుని వెన్నెల, భోజనము పైనపడును. అందరు తెలుపు డిజైను చీరలు కట్టుకుందురు. కడుపుచున్న అమ్మాయి పక్కన వేరొక కడుపుచున్న అమ్మాయి భోజనము చేయునప్పుడు కూర్చొనపెట్టుదురు.

ఆమెకు ఒక ఉయ్యాల కానుకగా ఇవ్వాలి. ఆ సమయములో కడుపుతో వున్న ఆడపిల్లలను బంతిలో వరుసగా కూర్చొనపెట్టవచ్చును. ఊయలలు అందరికి ఇవ్వవచ్చును. లేనిచో 3, 5గురికి కాని ఇవ్వవచ్చును. వెండివి లేక చెక్కవి ఏవైనా ఇవ్వవచ్చును.