ఇంద్రుడు

ఇంద్రుడు

bookmark

"ఇంద్రుడు:

హనుమ చిన్నతనం లో పండు అనుకొనిఉదయ సూర్య బింబాన్ని మింగటానికి ప్రయత్నించాడు .అప్పుడు రాహువు అడ్డు పడ్డాడు .రాహువునూ మింగే ప్రయత్నం చేశాడు ..రాహువు భయ పడి ఇంద్రుని శరణు వేడాడు ..ఇక్కడే రాహువు చరిత్రను తెలుసు కొందాం..ఇతడు రాక్షసుడు .సింహిక కొడుకు .అమృత పాన సమయం లో తన దాకా అమృతం రాదేమో ననే భయం తో ,సూర్య చంద్రులు దేవత ల సరసన రాహువు మారు వేషం లో కూర్చున్నాడు .సూర్య చంద్రులు గ్రహించి విష్ణువుకు చెప్పగా చక్రం తో రాహువు ను సంహరించాడు .అప్పటికే అమృతం గొంతు లోకి చేరటం వల్ల కంథం తెగింది కాని ,రాహువు ప్రాణం పోలేదు .అప్పటి నుండి రాహువు సూర్య చంద్రుల పై ద్వేషం పెంచుకొని అప్పుడప్పుడు కబలిన్స్తున్నాడు అవే సూర్య ,చంద్ర గ్రహణాలు .రాహువు కుమారుడు మేఘ హాసుడు తండ్రికి వచ్చిన ఆపద ను పొగొట్ట టానికి ఇతడు గౌతమీ నదీ తీరాన తపస్సు చేశాడని భారతం లో ,బ్రాహ్మ వైవర్త పురాణాలలో ఉన్నది  .

        రాహువు మాట విని ఇంద్రుడు  తో వచ్చి హనుమ ను వజ్రాయుధం తో కొట్టాడు .హనుమ హనువు దెబ్బ తింది .మూర్చ పోయాడు వాయువు కోపగించి స్స్టం భిన్చాడు .దేవతలు బ్రహ్మ తో వచ్చి వాయువును స్తుతించి బ్రతిమి లాడారు .శాంతించిన వాయుదేవుడు మళ్ళీ ప్రసారం కొన సాగించాడు .దేవత లందరూ ఆంజనేయుడికి అనేక వరాలిచ్చారు .హనువులు కొట్ట బడటం చేత ఆంజనేయునికి అప్పటి నుండి హనుమ అనే పేరు వచ్చింది .

               ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధి పతి .దిక్పాలకులలో ముఖ్యుడు .దేవతలకు అధి నాయకుడు .ఇంద్రుడు అనేది ఒకరి పేరు కాదు .దేవేంద్ర పదవి లో ఉన్న వాడిని ఇంద్రుడు అంటారు .అది ఒక పదవి .ఈ పదవి మన్వంతరాలను బట్టి ,,చేసే పనులను బట్టి మారుతుంటుంది .నూరు క్రతువులు చేసినవాడు ఇంద్రుడు అవుతాడు .ఉత్తమ మన్వంతరం లో సుశాంతుడు అనే వాడు ఇంద్రుదయాడు .రైవత మన్వంతరం లో విభుడు –ఇంద్రుడయాడు .చాక్షుష మన్వంతరం లో మనోజవుడిని ఇంద్ర పదవి వరించింది .నహుష చక్ర వర్తి  గర్వం వల్ల కొద్ది కాలం లోనే ఇంద్ర పదవి పోగొట్టుకొన్నాడు .

              ఇంద్రుడు అదితి కుమారుడు .విష్ణువు ఇతని తమ్ముడు .ఇద్దరు అదితి గర్భం లో జన్మించిన వారే .ఇంద్రుని భార్య శచీ దేవి .జయంతుడు ఇంద్రుని కుమారుడు .జయంతి కుమార్తె .ఇంద్రుని వాహనం ఐరావతం అనే తెల్ల ఏనుగు .అతని గుర్రం పేరు ఉచ్చైశ్రవం .ఈ రెండు పాల సముద్రము  నుండి అమృత మధనం లో  పుట్టాయి .వజ్రాయుధం ఇంద్రుని ఆయుధం .

ఇంద్రుడు దేవ లోకం లో ఉన్న అమృతానికి గట్టి కాపలా పెట్టి రక్షిస్తూ ఉంటాడు .గరుత్మంతుడు అందరి కళ్ళు కప్పి అమృత భాండాన్ని అపహరించుకొని పోతున్నప్పుడు ఇంద్రుడాతని పై వజ్రాయుధం ప్రయోగించాడు .అది అతన్ని ఏమీ చేయ లేక ఒక్క ఈకను  మాత్రమె రాల్చ గలిగింది .గరుడుని శక్తి సామర్ధ్యాలు తెలుసుకొన్న ఇంద్రుడు అతని తో స్నేహం చేసి ,అమృతాన్ని ఇతరులకు ఇవ్వ వద్దని హితవు చెప్పాడు .గరుత్మంతుని తల్లి వినత దాస్యాన్ని పొగొట్ట టానికి సవతి కద్రువ కొడుకు లైన పాములకు అమృతం ఇవ్వ వలసి వచ్చింది .వాళ్ళు ఆనందం తో తాగటానికి ప్రయత్నించే లోపు ఇంద్రుడు తెలుసుకొని దాన్ని అపహరించి దేవలోకానికి మళ్ళీ చేర్చుకొన్నాడు .

       నైమిశారణ్యం లో వైవశ్వతుడు సత్రయాగం చేస్తున్నాడు అప్పుడు మనుష్యులకు మరణం లేకుండా పోయింది .దేవతలకు మనుష్యులకు తేడా లేకుండా పోయిందని బాధ పడి ఇంద్రుని తో సహా దేవతలు బ్రహ్మ ను  వేడుకొన్నారు .అప్పుడాయన యముడి పని యముడే చేస్తాడని దేవతల వల్ల అయిదుగురు జన్మించి తనకు సాయం చేస్తారని చెప్పి పంపాడు .తిరిగి వచ్చే దారిలో ఒక యువతీ గంగా నది లో ఏడుస్తూ కనిపించింది .ఆమె బాష్పాలు బంగారు కమలాలు గా మారటం చూసి ఆశ్చర్య పోయారు .ఆమె ఎవరని అడిగాడు ఇంద్రుడు .తన తో రమ్మని ఈశ్వరుడు పార్వతి తో జూదం ఆడే ప్రదేశానికి తీసుకొని వెళ్ళింది .వరుణ రూపం లో ఉన్న ఈశ్వరుడు ఉన్నాడు .వరుణుడే అని భ్రాంతి పడి తన ముందు జూడమాడటమేమిటని కోపం గా ప్రశ్నించాడు .ఇంద్రుడు గర్వం గా మాట్లాడుతున్నాడని వాణ్ణి లాక్కొని రమ్మని అక్కడున్న యువతీ తో ఈశ్వరుడన్నాడు .ఆమె ఇంద్రుని తాక గానే అతడు భూమి మీద పడి పోయాడు .అక్కడి పర్వత గుహలో ఏముందో చూడమన్నాడు .అందులో నలుగురు ఇంద్రులు కన్పించి ఆశ్చర్య పరిచారు .ఇట్లా ఏర్పడిన అయిదుగురు ఇంద్రులు ధర్మ రాజు ,భీమ ,అర్జున నకుల సహదేవులు గా పుట్టారని భారత కద ."