కృష్ణుడు పాండవ పక్షం ఎలా అయ్యాడు
"కృష్ణుడు పాండవ పక్షం ఎలా అయ్యాడు:
దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరూ కృష్ణుని మద్దతు కోసం ద్వారక వెళ్లారు. దుర్యోధనుడు మొదట ద్వారక చేరుకుంటే, అప్పుడు సాత్యకి కృష్ణుడు నిద్రలో ఉన్నాడని చెప్పడంతో, అర్జునుడు వచ్చాక, ఇద్దరూ కృష్ణుడి గదిలోకి వెళ్లారు. అభిమాన ధనుడైన దుర్యోధనుడు కృష్ణుని తల వైపు కూర్చుంటే. అర్జునుడు మాత్రం ఓ భక్తునిలా కృష్ణుని పాదాల వద్ద చేతులు కట్టుకొని నిలబడతాడు. కృష్ణుడు నిద్ర లేవగానే మొదట అర్జునున్ని చూసి , పలరించి, ఆతర్వాత దుర్యోధనుడు ని చూసి పలకరిస్తాడు. అయితే నేను మొదట వచ్చానని దుర్యోధనుడు అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ మొదట అర్జునున్ని చూసినప్పటికీ, ఇద్దరికి న్యాయం చేస్తానని అంటాడు. 'నేను ఓ వైపు , ప్రసిద్ధ నారాయణి సైన్యం మరో వైపు శ్రీకృష్ణుడు యుద్దంలో ఎటువంటి ఆయుధం పట్టను , యుద్ధం చేయను' అని చెప్పడంతో ఎందుకు కొరగాని కృష్ణుడు ఎందుకంటూ, దుర్యోధనుడు అనుకుంటాడు. అయితే ముందుగా కోరుకునే అవకాశం అర్జునిడికి ఇవ్వడం, కృష్ణుడు తనకు రధ సారధిగా వుంటే చాలని అర్జునుడు కోరుకోవడం జరుగుతుంది. దుర్యోధనుడుకి ఆ నిర్ణయం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సైన్యాన్ని కోరుకుని దుర్యోధనుడు ఆనందం గా నిష్క్రమిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు మహా భారత యుద్దంలో అర్జునుడు రధ సారథి గా ఉంటూ, అన్ని రకాలుగా దోహదం చేస్తాడు."
