అనఘ! విను రసజ్ఞులై వినువారికి

అనఘ! విను రసజ్ఞులై వినువారికి

bookmark

"అనఘ! విను రసజ్ఞులై వినువారికి
మాటమాట కధిక మధురమైన
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ 
దలఁపు గలదు మాకుఁ దనివి లేదు.

భావము:
పుణ్యాత్మా! సూతా! శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు."