73,కన్నీటి బాధను విడుచుచున్న

73,కన్నీటి బాధను విడుచుచున్న

bookmark

కన్నీటి బాధను విడుచుచున్న నీ సన్నిధిలో
సరియైన త్రోవలోకి నడిపించుము
నన్ను సరియైన త్రోవలోకి నడిపించుము

1.ఏమి చేయను ఏలా చేయను
తెలియకనే కన్నీటిలో జీవిస్తున్నాను (2)
నీ సన్నిధి చూపి నడిపించు నాప్రభు
నీ పాదములందు ఉండును నాదేవా ||కన్నీటి||

2.విన్నవించలేను నిన్ను స్తుతించలేను
కట్టబడి చెరసాలలో వున్నాను
నా శ్రమలను తీర్చుము నా దేవా
ప్రతి సమయములో నీ కృపలో జీవింతునయ్య    ||కన్నీటి||

3.జారిపోయాను మనస్సు పగిలియున్నాను
శాంతి విడిచి కృంగి నలిగి యున్నాను
నా హస్తము పట్టి లేవనెత్తు యేసయ్య
నీ కరుణ చూపి నడిపించు ప్రేమమయ్యా ||కన్నీటి||