74,క్రీస్తుతో నా జీవితం అది ఎంతో
క్రీస్తుతో నా జీవితం అది ఎంతో అద్భుతం
అదిఅంత ఆనందం - నాకెంతో అత్యున్నతం
క్రీస్తే నాకాధారం - యేసే నా ప్రాణం ||క్రీస్తుతో||
1.ఈ లోకమంతా నేత్రాశ జీవితమంత జీవపుడంభం
అన్నింటిలో శరీరాశ-క్రీస్తుకు లేదేస్థానం
వినవా ఆయన స్వరము, తెరువవా నీ హృదయం ||క్రీస్తుతో||
2.నీ ఆశ అంత లోకమే క్రీస్తు ప్రేమ అంత నీపై
దినమంత నీకై వేచెగ ఎన్నడు నీవు గ్రహింతువు
రావా క్రీస్తులోనుండ విడువకా ఎత్తుబడిదవా ||క్రీస్తుతో||
3.ఆయన ప్రేమ గ్రహించిన క్రీస్తు నిన్ను క్షమించును
శ్రమలలో సేవించిన ఆయన సింహాసన మిచ్చు
అమరమే నీజీవితం పరలోక పౌరసత్వం||క్రీస్తుతో||
