487,ఈ స్తుతి నీకే మా యేసుదేవ
ఈ స్తుతి నీకే మా యేసుదేవ - మనసార నిన్నే సేవింతుము
మా మనసార నిన్నే సేవింతుము - పరలోక దూతాళి
స్తోత్రాలతోనే - మా స్తోత్రగానాలుగైకొనుమా
1.జగతికి పునాది నీవనీ - మాలోని ఊపిరి నీవేనని
మా పోషకుడవు నీవేనని - మా కాపరివి నీవేనని
మా హృదయాలలో ఉండాలనీ-నీ సాక్షిగా మేము బ్రతకాలనీ
2.మనసారా నీ దరి చేరగా - మా కెంతో సంతోషమాయెగా
హల్లెలూయా స్తుతి మధురగీతాలతో
మా హృది ప్రవహించే సెలయేరులా
నీ మధుర ప్రేమను చాటాలని-నీ జీవబాటలో నడవాలని
