488,ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా
నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా
హల్లేలూయ హల్లేలూయ - హల్లేలూయ హల్లేలూయ
1.బాధలలో మంచిబందువువైైనావు
వ్యాధులలో పరమవైద్యుడవైనావు
చీకటి బ్రతుకులో దీపము నీవై
పాపములన్నియు కడిగినదేవా
నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా
నా బ్రతుకు దినములెల్ల నిన్నే వేడెద
2.శోధనలో సొంత రక్షకుడైనావు
శ్రేష్ట ప్రేమ చూపిస్నేహితుడైనావు
హృదయ వేదన తొలగించినావు
కృపా క్షేమములో నడిపించినావు
నా కోసం భువి కొచ్చిన దైవమానవా
నా బ్రతుకు దినమెల్ల నిన్నువేడెద
