307,సుధినం సర్వ జనులకు
సుధినం సర్వ జనులకు - సమధానం సర్వ జగతికి - (2)
ప్రభుయేసుని జననమనాడు - వికసించెను మధినీ నేడు ||సుధి||
1.చీకటి మరణంబులమయం - ఈ మానవ జీవిత మార్గం - ఆ...ఆ..ఆ....... (2)
పరముకు పధమై అరుధించె - వెలుగై యేసుడు ఉదయించె - (2) ||సుధి||
2.కన్నీటితో నిండిన కనులను - ఇడుములన్నిటిని తుడువను - ఆ...ఆ..ఆ....... (2)
ఉదయించెను కాంతిగా నాడు - విరజిమ్మెను శాంతిని నేడు - (2) ||సుధి||
3.వచ్చెను నరుడుగ ఆనాడు - తెచ్చెను రక్షణ ఆనాడే - ఆ...ఆ..ఆ...... (2)
త్వరలో వచ్చును ఆరేడు - స్థిరపడుమా ఇక ఈనాడు - (2) ||సుధి||
