308,స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం
స్తుతి చేసి నేపాడనా-స్తోత్రగీతం
భజియించి నేపొగడనా స్వామి (2)
హల్లెలూయాహల్లెలూయా-హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా (2)
1.దానియేలును సింహపుబోనులో
కాపాడినది నీవెకదా (2)
జలప్రళయములో నోవాను కాచినా
బలవంతుడవు నీవెకదా (2)
నీవెకదా-నీవెకదానీవె కదా (2) ||హల్లె||
2.సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన
సచ్చరితుడవు నీవే కదా (2)
పాపుల కొరకై ప్రాణము నిచ్చిన
కరుణామయుడవు నీవేకదా (2)
నీవెకదా-నీవెకదానీవె కదా (2) ||హల్లె||
3.యూదా సింహమై రాజాధిరాజుగా
రానున్నవాడవు నీవే కదా
ఆరాధ్యదైవమై సకలయుగంబుల
స్తోత్రార్హుడవు నీవే కదా (2) ||హల్లె||
