251,యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
యేసూ నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా
ఘనుడా నీ దివ్యసన్నిధి - నను ఆదుకునే నా పెన్నిది
అ.ప: నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2)
1.నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే - తెగులు నన్నంటదు (2)
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు||
2.నీవే నాతో వస్తే - కొరత నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే - క్షయతనన్నంటుదు (2)
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు||
3.నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు (2)
నీవే ఆజ్ఞాపిస్తే - చికటి నన్నంటదు (2)
నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా (2) ||యేసు||