252,యేసే గొప్ప దేవుడు
యేసే గొప్ప దేవుడు
మన యేసే శక్తిమంతుడు
యేసే ప్రేమ పూర్ణుడు
యుగయుగముల స్తుతి పాత్రుడు (2)
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్ (2)
1.మహాశ్రమలలో వ్యాధి బాధలలో
సహనముచూపి స్థిరముగ నిలిచిన
యోబు వలనే జీవించేదను (2)
అద్వితియ్యుడు ఆది సంభూతుడు
దీర్ఘశాంతుడు మన ప్రభుయేసే (2) ||స్తోత్రము||యేసే||
2.ప్రార్థన శక్తితో- ఆత్మ బలముతో
లోకమునకూ ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును
మహాన్నతుడు మన రక్షకుడూ
ఆశ్రయ దుర్గము మన ప్రభుయేసే (2) ||స్తోత్రము||యేసే||
