221,ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో

221,ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో

bookmark

ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము
యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము ||ప్రార్ధన||

1.ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం
క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము    (2)
ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం
దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం ||ప్రార్ధన||

2.ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం
దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం    ||ప్రార్ధన||

3.ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం
ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం ||ప్రార్ధన||

4.ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం
ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం ||ప్రార్ధన||