219,ప్రార్థన వినెడి పావనుడా

219,ప్రార్థన వినెడి పావనుడా

bookmark

ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన||

1.శ్రేష్టమైన భావము గూర్చి
శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రనుతించేదము
పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

2.పరమ దేవుడవని తెలిసి
కరము లెత్తి జంటగా మోడ్చి
శిరమునువంచి సరిగను వేడిన
సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

3.దినదినంబు చేసిన సేవ
దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యి దిటముగా కొండను
చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||

4.శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన||