163,నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా
నాలోని ఆశాజ్యోతినీవే నా ప్రభువా -
నీధరికి నడిపించు నావా నాజీవ నావ
1.నిను నేను ఈ జగాన కొనియాడగా -
అనువైన పాటపాడి వినుతింపగ
నీ పదసేవ చేయగ దేవా -
ఎనలేని జీవమును -
వనగూర్చుమయ్యా - (2)
2.నా హృదయ ఆలయాన నివశింపుమా -
నీ మహిమ మందిరాన నను నిల్పుమా - 2
పావన నామ జీవనధామ -
నాత్మ దీపమును -
వెలిగించుమయ్యా - (2)
