164,నాతో మాట్లాడుమయ్యా

164,నాతో మాట్లాడుమయ్యా

bookmark

నాతో మాట్లాడుమయ్యా - నన్నూ దర్శించుమయ్యా
నీ మందిరాన - నీ సన్నిధాన  - నీ ఆత్మతో నన్ను - నింపుమయా
యేసయ్యా .... ఆ.. ఆ.. యేసయ్యా .. ఆ..ఆ.. యేసయ్యా... ఆ   ఆ..యేసయ్యా .... యేసయ్యా....    

1.కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా .... ||యేసయ్యా||

2.నావారే నన్ను నిందించేవేళ - నను విడచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు కరువైనవేళ - దరిచేర్చి ఓదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై 
నిత్యము నను నడిపించుమయ్యా .... ||యేసయ్యా||

3.నా కాలు జారి తొట్రిల్లువేళ - చేజాచి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను బంధించేవేళ - నను చేరి విడిపించుమయ్యా
నీ చెతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా .... ||యేసయ్యా||