వేదకల్పవృక్షవిగళితమై శుక
"వేదకల్పవృక్షవిగళితమై శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న
భాగవతపురాణఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసికభావవిదులు.
భావము:
భాగవత మనే ఈ మహాఫలం వేద మనే కల్పవృక్షం నుండి బాగా పండి రాలింది. శుకముఖ సుధాద్రవంతో అతిశయించి ఉంది. భావజ్ఞులు రసజ్ఞులు ఐన భక్తవరేణ్యులారా! రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి."
