పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు

పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు

bookmark

"పుండరీకయుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁగవకు నెదురఁ గానఁబడియె.

భావము:
ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు. మేఘం ప్రక్కన మెరుపులాగ ఆయన ప్రక్కన ఒక స్త్రీమూర్తి ఉంది. చంద్ర మండలంలోంచి కురిసే అమృత ధారలా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. కానుగవృక్షాన్ని చుట్టుకొన్న తీగలా ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతోంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగ ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విరిసిన తెల్ల దామరరేకులవంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో, ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు విందుచేశాడు."