ముదిమనవ సంతానం అయితే
ముదిమనవ సంతానం అయితే:
4వ తరములో బారసాల పూర్తి అయినాక మనుమడు, మనుమని భార్య ఇద్దరు, తాతకు, నానమ్మకు పాదపూజచేసి బట్టలు పెట్టాలి. ఆ బట్టలు కట్టుకుని ముది మనవనికి బంగారు ఉగ్గు గిన్నెతో పాలు తాగించాలి. పుట్టిన బాబుతో తోటకూరగింజలు తాకనిచ్చి మట్టిలో చల్లాలి. ఆ మట్టిని ఇంటికి తీసుకువెళ్ళి కుంపటిలో వేసిన తోటకూర వస్తుంది. ముది మనవడిని ఎత్తుకుని 3 గుమ్మాలు దాటవలెను. తోటకూర మొక్క మొలచి ఆకులు వచ్చినాక వండి ముదిమనవని చేతిమీదగా కంచంలో పెట్టించుకుని తినవలెను. నానమ్మ ఒక్కరే వున్నా ఈ వేడుకలు జరుపుకొనవచ్చును.
