పెండ్లికూతురును నెలలోపల పంపుట

పెండ్లికూతురును నెలలోపల పంపుట

bookmark

పెండ్లికూతురును నెలలోపల పంపుట:

తెలుపు రంగు డిజైను వున్న చీర తీసుకొనవలెను. అమ్మాయి భోజనము చేసిన తరువాత చీరచేతికి ఇచ్చినచో కట్టుకొనును. తూర్పువైపుకు కూర్చొనపెట్టి ఒడిలో 3ముద్దలు చలిమిడి, పసుపుకుంకుమ, జాకెటు ముక్క, తాంబూలము, పండ్లు, పీచువున్న కొబ్బరికాయ, పూలు, బియ్యము 5గుప్పిళ్ళు వడిలో పెట్టవలెను.

పసుపు చెంబు:

వెండి లేక ఇత్తడి చెంబు నిండా పసుపు పోయాలి. తెల్లటి గుడ్డ లేక తెలుపు చేతిరుమాలు చెంబుకు కట్టి, అత్తవారింటికి వెళ్ళునప్పుడు అమ్మాయి చేతికి ఇవ్వవలెను. అత్తగారింటికి వెళ్ళినాక దేవుని గుడివద్ద పసుపుకుంకుమ, ఆ పసుపు చెంబు పెట్టవలెను. పసుపు మామూలుగా వాడుకొనవచ్చును. నెల లోపల పసుపు ఇవ్వనిచో కాపురమునకు పంపు సమయములో ఇచ్చెదరు.