ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురాణావళుల్

ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురాణావళుల్

bookmark

"ఒనరన్ నన్నయ తిక్కనాదికవు లీ యుర్విం బురాణావళుల్
తెనుఁగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుఁగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా
జననంబున్ సఫలంబుఁ జేసెదఁ బునర్జన్మంబు లేకుండఁగన్.

భావము:
పోతన తన అదృష్టాన్ని తానై కొనియాడుకొంటున్నాడు. ఎందుకంటే తనకు పూర్వులైన నన్నయతిక్కనాదులు భాగవతం జోలికి పోలేదు. అట్టి తన భాగ్యాన్ని పైకి సంభా వించుకుంటూ లోపలలోపల మహాకవుల మహోన్నతత్వాన్ని లోకానికి తెలియజేస్తున్నాడు. 
అసమాన ప్రతిభగల నన్నయ, తిక్కన మొదలైన మహాకవులు పురాణాల సముదా యాలను తెలుగులో రచించటానికి పూనుకున్నారు. కానీ నేను పూర్వజన్మలలో చేసిన పుణ్యాలపంట ఎటువంటిదో కానీ భాగవతం రచించటంలేదు. అది నాకోసమే అన్నట్లుగా మిగిల్చారు. కనుక నేను భాగవతాన్ని తెలుగు కావ్యంగా రచించి నాపుట్టుక సఫలం అయ్యేట్లు చేసుకుంటాను. దీనితో నాకు మళ్లీ పుట్టనవసరం లేని మహాభాగ్యం కలుగుతుంది. 
సంస్కృతంలో ఉన్న పురాణగ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ భట్టారకుడూ, తిక్కన సోమయాజి మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు. నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాను. అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశః నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను."