సూక్తులు  - 5

సూక్తులు - 5

bookmark

    "సూక్తులు  - 5:

41. కుండలు వేరైనా మట్టి ఒక్కటే
నగలు వేరైనా బంగారం ఒక్కటే
అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే
అన్ని తెలుసుకున్న వాడే జ్ఞానీ

42. గుర్తుంచుకో…ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు ఎం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది
భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది.

43. మానసిక శాంతి లేని జీవితం వృధా
కోపం బుద్దిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది

44. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంత కాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నదీ ఒక్కటే, ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ  తెలుసుకొని జీవించడమే.!

45. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టిన నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్న కాలం తప్పక శిక్షిస్తుంది.

46. దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తూ భగవంతుడే  మానవునిగా పుట్టినా కూడా ఈ బాధలనుండి తప్పించుకోలేదు.
ఇహ మానవమాత్రులం మనమెంత.!

47. నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు.
యుక్తుడు కానీ వానికి ధ్యానం కూడా కుదరదు.
ధ్యానం లేనివాడికి  శాంతి లేదు.
శాంతి లేనివాడికి సుఖమెక్కడ ?

48. గురువులు ఎందరో 
సద్గురువులు ఎందరో
మార్గాలు ఎన్నో 
బోధలు ఎన్నో 
శోధనలు ఎన్నో 
కానీ
గురువులకు గురువు అయిన జగత్గురువు ఒక్కరే 
గీత తెలుపని 
మార్గాలు లేవు
బోధలు లేవు
సాధన లేదు.

49. అభ్యాసం కంటే జ్ఞానం 
అంతకంటే ధ్యానం 
దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి.
త్యాగం వలనే శాంతి కలుగుతుంది.

50. ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది మరియు మూర్కపు
పట్టుగలది.  దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా 
అనిపిస్తుంది, ఓ కృష్ణా."