సత్యనారాయణ స్వామి వ్రతము

సత్యనారాయణ స్వామి వ్రతము

bookmark

సత్యనారాయణ స్వామి వ్రతము:

సత్యనారాయణ స్వామి మండపము తెచ్చుకుని కడిగి పసుపురాసి బొట్టుపెట్టి పూలతో అలంకరించవలెను. గోధుమపిండి, పంచదార, ఎండుద్రాక్ష, జీడిపప్పు, సన్నని ముక్కలుగా చేసి కరిగిన నెయ్యివేసి అన్నియును కలపవలెను. ఇది సత్యనారాయణ స్వామి ప్రసాదము. పొంగలి సిద్ధం చేసి ఉంచవలెను. 5గురు బాలదాసులకు తుండ్లు, 5గురు ముత్తైదువులకు పసుపుకుంకుమ పెట్టవలెను.

ఆడపిల్ల వివాహము చేసినప్పుడు పెండ్లికి ముందుగానే ఈ నోము నోచుకుందురు.

నోముకు కావలసిన వస్తువులు:
పసుపు - 50 గ్రా
కుంకుమ - 50 గ్రా
తమలపాకులు - 2 కట్టలు
వక్కలు - 100 గ్రా
ఎండుఖర్జూరాలు - 250 గ్రా
ఎండుద్రాక్ష - 5 రూ
ఎండుకొబ్బరి చిప్పలు - 5
పసుపుకొమ్ములు - 250 గ్రా
కొబ్బరికాయలు - 9
అరటిపండ్లు - 9
పంచదార - 1 1/2 కేజి
గోధుమపిండి - 1 1/4 కేజి
జీడిపప్పు - 10 రూ
బియ్యము - 2 1/2 కేజి
ఆవుపాలు - 1 గిద్ద
నెయ్యి - 100 గ్రా

కుందులు, ఏకహారతి, నూనె, కర్పూరము బిళ్ళలు, వత్తులు, పత్తి, గంధం, పీటలమీదకు తుండు, సత్యనారాయణ రూపు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, బియ్యము, పూలమాల, తులసిమాల, విడిపూలు, కలశమునకు జాకెట్టు ముక్క, పుట్టింటివారి కట్నాలు కావలసినవి.