విష్ణు పంజరస్తోత్రం
విష్ణు పంజరస్తోత్రం:
ఈ స్తోత్రం చేస్తే విష్ణువు వారి చుట్టూ ఉండి రక్షిస్తాడు. విన్నా చాలు, చదివినా చాలు. ఇది శివునికి విష్ణువు చెప్పినటువంటిది.
నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనమ్!
ప్రాచ్యాం రక్షస్వమాం విష్ణో త్వామహం శరణం గతః!!
గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభామితద్యుతే!
యామ్యాం రక్షస్వమాం విష్ణోత్వామహం శరణం గతః!!
హలమాదాయసౌనందం నమస్తే పురుషోత్తమ!
ప్రతీచ్యాం రక్షమే విష్ణో భవంతం శరణం గతః!!
శార్జమాదాయచ ధనురస్త్రం నారాయణం హరే!
నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః!!
పాంచజన్యం మహాశంఖమంతర్బోధ్యం చ పంకజమ్!
ప్రగృహ్య రక్షమాం విష్ణో ఆగ్నేయ్యాం యజ్ఞసూకర!!
చర్మ సూర్య శతం గృహ్య ఖడ్గం చంద్రమసంతథా!
నైరృత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తే నృకేసరిన్!!
వైజయంతీం ప్రగృహ్యత్వం శ్రీవత్సం కంఠభూషణమ్!
వాయవ్యాం రక్షమాం దేవ అశ్వశీర్ష నమోస్తుతే!!
వైనతేయం సమారుహ్య అంతరిక్షే జనార్దన!
మాంత్వరం రక్షాజిత్ సదా నమస్తే త్వపరాజిత!!
విశాలాక్షం సమారుహ్య రక్ష మాంత్వం రసాతలే!
ఆకూపార నమస్తుభ్యం మహామోహ నమొస్తుతే!!
కరశీర్సాంఘ్రిపర్వేషుతథాష్ట బాహు పంజరమ్!
కృత్వారక్షస్వమాం దేవ నమస్తే పురుషోత్తమ!!
ఏతదుక్తం భగవతా వైష్ణవం పంజరం మహత్!
పురా రక్షార్థమీశేన కాత్యాయన్యా ద్విజోత్తమ!!
నాశయామాస సా యత్ర దానవం మహిషాసురమ్!
సమరం రక్తబీజం చ తథాన్యాన్ సురకంటకాన్!!
