రామచంద్రాయ
"రామచంద్రాయ:
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
కోసలేశాయ మందహాస దాసపోషణాయ
వాసవాది వినుత సద్వరద మంగళం || 1 ||
చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ
హారకటక శోభితాయ భూరి మంగళం || 2 ||
లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ
జలద సద్రుశ దేహాయ చారు మంగళం || ౩3||
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ
చాప జాత గురు వరాయ భవ్య మంగళం || 4 ||
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ
అండజాతవాహనాయ అతుల మంగళం || 5 ||
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం || 6 ||
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || 7 ||"
