భూషణములు వాణికి నఘ

భూషణములు వాణికి నఘ

bookmark

"భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచితభాషణముల్.

భావము:
శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను ఎండగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి"