బృహదీశ్వర ఆలయం

బృహదీశ్వర ఆలయం

bookmark

బృహదీశ్వర ఆలయం:

మిళనాడులో చెన్నైకి 318 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది క్రీస్తు శకం 1010 లో చోళ వంశపు రాజులు నిర్మించారు. ఆలయం లోకి ప్రవేశించిన వెంటనే మనకి కైలాసంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆలయ ప్రవేశంలో మనకి ముందుగా పెద్ద నంది దర్శనం ఇస్తుంది. ఆలయ నిర్మాణం చాలా అమోఘంగా ఉంటుంది. ఆ ప్రాకార నిర్మాణాన్ని తిలకించడం ఒక అందమైన అనుభూతి.

ఇక్కడ శివుడు చాల పెద్ద లింగాకారంలో మనకి దర్శనం ఇస్తాడు. ఆ లింగాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ఆలయం చుట్టురా వందల సంఖ్యలో మనం శివలింగాలు, నందులను చూడవచ్చు. శివ భక్తులు ఒక్కసారైనా దర్శించవలసిన గుడి ఇది.

హర హర మహాదేవ శంభో శంకర
బృహదీశ్వర ఆలయం అతి ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరులో ఉంది. ఇది శివాలయం. దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.

దీనిని చోళ రాజు రాజరాజ చోళుడు నిర్మించాడు. ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతితో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది.

రాజరాజ చోళుడు క్రీ.శ.985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బగుడిలోని శివలింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు.

ఒకప్పుడు అంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటుతున్నాయి.