బిడ్డసారె
బిడ్డసారె:
కావలసినవి:
పసుపు 1 కేజీ, కుంకుమ 1 కేజీ, సున్నిపిండి 1 కేజీ, చలిమిడి 3 కేజీలు, చక్రాలు 100, పంచుసామాను 100, పండ్లు 50.
బాబుకు సంబంధించినవి (డ్రస్సులు, దుప్పట్లు, టర్కిటవల్, గిలక్కాయలు, బొమ్మలు)
స్టీలువి: పీటలు, బక్కెటు, బిందె, చెంబు
వెండివి: ఫారెక్స్ కప్పు, స్పూను, బొట్టుసామాను.
ఒడిలో పెట్టు చలిమిడికి నువ్వులు అద్దకూడదు.
5 చక్రాలు, పుట్టిన బాబు / పాపకు తొడగవలెను. బయలుదేరునప్పుడు ఎక్కించి కారులో కూర్చొనగానే తీయుదురు. ఈ చక్రము గుండ్రముగ ఒక చుట్టగామధ్యలో బాబు చేయి పట్టేంత బెజ్జము వుండేలా వండుదురు.
ఒడిపాలు:
బియ్యము 5గిద్దలు, రూపాయిబిళ్ళలు 5, వెల్లుల్లిపాయలు 5, పండు తాంబూలము, జాకెటు ముక్క, పీచుకొబ్బరికాయ ఒడిలో పెట్టవలెను.
