పలుకే బంగారమాయెనా
"పలుకే బంగారమాయెనా:
పలుకే బంగారమాయెనా కోదండపాణి
పలుకే బంగారమాయెనా ||
పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా ||
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా ||
రాతినాతిగ జేసి భూతలమున
ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి
పలుకే బంగారమాయెనా ||
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు
పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి
పలుకే బంగారమాయెనా ||
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా
కరుణించు భద్రాచలవర రామదాస పోష
పలుకే బంగారమాయెనా ||"
