నిత్య పూజా విధానం-3

నిత్య పూజా విధానం-3

bookmark

కలశారాధన
తదంగ కలశారాధనం కరిష్యే
{మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్ళు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒక గ్లాసు గాని ,చెంబు గాని తీసుకుని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను. కలశమునకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి, కలశంలో ఒక పువ్వు, కొద్దిగా అక్షంతలు వేసి, కుడి చేతితో కలశంను మూసి పెట్టి, ఈ క్రింది మంత్రాలను చెప్పవలెను}
శ్లో|| కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్ర స్థితోబ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋద్వేదో థ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ||
గంగేచ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు ||
ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః
కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి)
ఆత్మానాం సంప్రోక్ష్య (మన పైన)
పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యాల పైన చల్లాలి)
******
షోడశోపచార పూజ
1) ఓం శివాయ నమః --- ధ్యానం సమర్పయామి
2) ఓం పరమేశ్వరాయ నమః --- ఆవాహయామి
3) ఓం కైలాసవాసాయ నమః --- సింహాసనం సమర్పయామి
(సింహాసనార్ధం అక్షతాన్ సమర్పయామి)
4) ఓం గౌరీనాధాయ నమః --- పాదయో: పాద్యం సమర్పయామి
5) ఓం లోకేశ్వరాయ నమః --- హస్తయో: అర్ఘ్యం సమర్పయామి
6) ఓం వామదేవాయ నమః --- ముఖే ఆచమనీయం సమర్పయామి
7) ఓం రుద్రాయ నమః --- మధుపర్కం సమర్పయామి
8) ఓం వృషభవాహనాయ నమః --- పంచామృత స్నానం సమర్పయామి
పంచామృత స్నానానంతరం శుద్దోదక స్నానం సమర్పయామి
9) ఓం దిగంబరాయ నమః --- వస్త్రయుగ్మం సమర్పయామి
10) ఓం జగన్నాధాయ నమః --- యజ్ఞోపవీతం సమర్పయామి
11) ఓం భవాయ నమః --- ఆభరణం సమర్పయామి
(ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి)
12) ఓం కపాలధారిణే నమః --- గంధం సమర్పయామి
13) ఓం మహేశ్వరాయ నమః --- అక్షతాన్ సమర్పయామి
14) ఓం సంపూర్ణగుణాయ నమః --- పుష్పం సమర్పయామి
సూచన
* అర్ఘ్యం, పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు స్వామికి చూపించి వేరొక పాత్ర లో వదలవలెను. అరివేణం (పంచ పాత్రకు క్రింద నంచు పళ్ళెము) లో వదలరాదు.
* మధుపర్కం సమర్పయామి అనగా స్వామివారికి స్నానం చేయుటకు వస్త్ర మిచ్చుచున్నామని అర్ధం. ఈ మధుపర్కంను ఆయన ప్రతిమకు అద్దవలెను. (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆ పైన రెండు వైపులా పసుపులో అద్ది ఉంచుకొన్న దాన్ని మధుపర్కం అంటారు)
* వస్త్ర యుగ్మం సమర్పయామి (యుగ్మమనగా రెండు) అనుచు వస్త్రమును (ప్రత్తిని పెద్ద బొట్టు బిళ్ళ సైజులో గుండ్రముగా చేసి నీటిలో తడిపి ఆపైన రెండు వైపులా కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును. ఇటువంటివి రెండు చేసుకొనవలెను ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.
* ఉపవీతం సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును. ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.
******
అథాంగ పూజ
ఓం శంకరాయ నమః – పాదౌ పూజయామి
ఓం శివాయ నమః – జంఘే పూజయామి (పిక్కలు)
ఓం మహేశ్వరాయ నమః – జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం త్రిలోకేశాయ నమః – ఊరుం పూజయామి (తొడలు)
ఓం వృషాభారూఢాయ నమః – గుహ్యం పూజయామి
ఓం భస్మోద్ధోళిత విగ్రయా నమః – కటిం పూజయామి(నడుము)
ఓం మృత్యుంజయాయ నమః – నాభిం పూజయామి
ఓం రుద్రాయ నమః – ఉదరం పూజయామి
ఓం సాంబాయ నమః – హృదయం పూజయామి
ఓం భుజంగభూషణాయ నమః – హస్తౌ పూజయామి
ఓం సదాశివాయ నమః – భుజౌ పూజయామి
ఓం విశ్వేశ్వరాయ నమః – కంఠం పూజయామి
ఓం గిరీశాయ నమః – ముఖం పూజయామి
ఓం త్రిపురాంతకాయ నమః – నేత్రాణి పూజయామి
ఓం విరూపాక్షాయ నమః – లలాటం పూజయామి
ఓం గంగాధరాయ నమః – శిరః పూజయామి
ఓం జటాధరాయ నమః – మౌళీం పూజయామి
ఓం పశుపతయే నమః – సర్వాణ్యంగాని పూజయామి
******
అష్టోత్తర శతనామపూజ
******
15) ఓం పార్వతీనాధాయ నమః --- ధూపమాఘ్రాపయామి
16) ఓం తేజోరూపాయ నమః --- దీపం దర్శయామి