నిత్య పూజా విధానం-1

నిత్య పూజా విధానం-1

bookmark

యాంత్రికజీవన విధానములో దేవుని పూజకి కేటాయించే సమయం కూడా విలువైనదిగానే కనిపిస్తుంది. కానీ కాలమెంత విలువైనదైనా ఇంత విలువైన మానవజన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో, 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని, భక్తిగా భగవంతుడిని తలచుకున్నా, పూజ చేసుకున్నా మనజన్మకు సార్థకత లభిస్తుంది.
ప్రతీ ఒక్కరు ఇంట్లో పూజ చేసుకుంటారు. దేవుడి మహిమనో ఏమో కానీ ఈ మధ్య నాస్తికులు కూడా దేవుడిని పూజించడం మొదలుపెట్టారు. మరి రోజూ ఇంట్లో పూజ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా!!
{ప్రతి దేవుని (దేవత) పూజకు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం మీరు ఏ దేవుని పూజిస్తారో ఆ దేవుని పూజించవలెను.}
వినాయకుని శ్లోకం
శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే
***
వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః
{అని నమఃస్కారం చేసుకోవాలి}
******
శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః
***
పవిత్రము
శ్లో|| అపవిత్రః పవిత్రోవా సర్వావస్తాం గతోపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం | సభాహ్యా అభ్యంతర శుచిః ||
పుండరీకాక్ష | పుండరీకాక్ష | పుండరీకాక్షాయ నమః ||
{ పంచపాత్రలోని నీటిని ఉద్దరిణితో తీసుకుని బొటన వేలితో 3సార్లు తలపై చల్లుకోవాలి }
******
అనంతరం ఏకాహారతి వెలిగించాలి
{ ఏకాహారతి వెలిగించి దానికి గంధం, పసుపు, కుంకుమ అలంకరించాలి }
దీపారాధన
{యీ క్రింది మంత్రమును చెప్పుతూ దీపమును ఏకాహారతి తోటి వెలిగించాలి అంతే కానీ దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించరాదు}
శ్లో|| దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః |
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహిమే ||
ఇతి దీపదేవతాభ్యో నమః
{దీపానికి గంధం, పసుపు, కుంకుమ, పువ్వులు అలంకరించాలి. ఆడవారు 5వత్తులు, మగవారు 3వత్తులు, హీనపక్షంలో కనీసం 2వత్తులు వెలిగించాలి}
[ ఓ దీప దైవమా! నీవు బ్రహ్మస్వరూపమై ఉన్నావు. మాకు సకల సౌభాగ్యాలను, సుపుత్రులను ఇచ్చి, మా కోర్కెలన్నింటినీ తీర్చుమా అని అర్ధం ]
******
(దీపం వెలిగించి గంటను వాయిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువుకొనవలెను)
ఘంటా నాదము
శ్లో || ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసామ్ |
కుర్యాత్ ఘంటారావం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ ||
[అంటే దేవతలు ఉండే చోట రాక్షసులు ఉండరు కదా. ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడం జరుగుతుంది]
******