దుడుకు గల నన్నే

దుడుకు గల నన్నే

bookmark

"దుడుకు గల నన్నే:

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో ||

కడు దుర్విషయా కృష్టుడై గడియ గడియకు నిండారు
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

శ్రీ వనితా హృత్కుముదాబ్జా వాఙ్మానస గోచర
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

పర ధనముల కొరకు పరుల మది
కరగ-బలికి కడుపు నింప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

తన మదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపిన
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

తెలియని నటవిట క్షుద్రుల వనితలు స్వవశమౌట కుపదెశించి సంతసిల్లి
స్వరలయంబు లెరుంగకని శిలాత్ముడై సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను దేవది దేవ
నెర నమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

చక్కని ముఖ కమలంబును సదా నా మిదిలో స్మరణ లేకనే దుర్మదాంధ-
జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ దురాశలను రోయలేక
సతత మపరాధినై చపల చిత్తుడనైన
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మందలేక
మద మత్సర కామ లోభ మోహులకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటినిగాక
నరాధములను చేరి సారహీన మతములను సాధింప దారుమారు
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||

సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు ధన తతులకై
తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ||"