క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత

క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత

bookmark

"క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయసుందరవేణికి రక్షి తామర
శ్రేణికిఁ దోయజాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్.

భావము:
హృదయంలో భవ్యమైనభావన కదలాడాలంటే ఆ తల్లి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి. ఆభావన పలుకుగా రూపం దిద్దుకొని నాలుకపై నాట్యమాడా లంటే ఆయమ్మ చల్లనిచూపు జాలువారాలి. అందునా పలుక బోయేది భాగవతం. దానికై చదువుల తల్లి సదమలకృప సమృద్ధిగా కావాలి. పోతన ఆమెదయకోసం ప్రార్థిస్తున్నాడు. 
అవతరించి లోకాలకు కన్నతల్లి అయినది. భారతి, ఉమ, రమ‍ అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలకు మూలమైన ఆదిశక్తి అయిన దుర్గమ్మ. అందువలననే సనాతని కనుక చాలపెద్దఅమ్మ. దేవతలకు పగవారైన రాక్షసుల అమ్మల కడుపును పనికిమాలినదిగా చేసి లోకాలను కాపాడే అమ్మ. హృదయంలోపలి సన్నని వరిముల్లువంటి రంధ్రంలో నిలుపుకొని నమ్మికొలిచే దివ్యత్వం కల మాతృభావంతో అలరారే వారి మనస్సులనే ఆలయాలలో అలరారే తల్లి. ఆ తల్లి మాకు ఎంతో సమున్నతమైన విలువలుగల కవిత్వంలోని పాటవానికి సంబంధించిన సంపదలను ప్రసాదించుగాక. 

నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ నాలుగు చేతుల చల్లని తల్లిని సదా సంస్తుతిస్తాను."