కోటప్పకొండ
శ్రీ త్రికూటేశ్వర స్వామి - కోటప్పకొండ:
ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్థలాలలో కోటప్పకొండ ఒకటి. త్రికోటేశ్వరస్వామి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కి.మీ. దూరంలోగల ఈ క్షేత్రానికి ఏ ప్రాంతం నుండైనా సులభంగా చేరవచ్చు. రైలు మార్గంలో అయితే గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడనుండి గంట ప్రయాణంతో నరసరావుపేటకు చేరి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. నరసరావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం, ప్రైవేటువాహన సౌకర్యం వున్నాయి.
క్షేత్ర వైభవం:
చతుర్దశ భువనాలు శివమయ సంధానాలు, మంగళకరమగు శివ శబ్దము సకల చరాచర జీవకోటికి ఆధారము. పరమేశ్వరుడు ఆది అంతాలు లేని సర్వవ్యాపనమైన చైతన్య శక్తి. అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం. అందుకే శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం. ఆ లింగమే త్రికోటేశ్వరుడు. ఆయనే కోటప్ప. అంతటి మహొత్కృష్టమైన క్షేత్రమే త్రికూటాచలం. అదియే కోటప్పకొండ. పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో కోటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం.
కృత, త్రేతా, ద్వాపరయుగాల నుండి పుణ్యభూమిగా పరిగణింపబడుచున్న భారతదేశంలోని దక్షిణ భాగంలో అపర కైలాస క్షేత్రంగా పేరొందిన త్రికోటేశ్వరస్వామికి నిలయమైన దివ్యభక్తపధము కోటప్పకొండ. పిలిచిన పలికే ప్రసన్న కోటేశ్వరునిగా, భక్తుల కోర్కెలు తీర్చే ఎల్లమంద కోటేశ్వరునిగ కష్టాల నుండి కడదేర్చే కావూరు త్రికోటేశ్వరునిగ, ఆపదలలో ఆదుకునే చేదుకో కోటయ్యగా, సంతతిలేనివారికి సంతానాన్ని కలుగచేసే సంతాన కోటేశ్వరునిగా యుగయుగాల నుండి నేటి వరకు భక్తుల ఆరాధ్యంగా విరాజమానమగుచూ కోరిన వారికి కొంగు బంగారంగా నిత్యార్చనాభిషేకాదుల నందుకుంటూ కోటి ప్రభలు విరజిమ్ముతూ సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ, శుభము, విజయము అవలీలగా అనుస్యూతంగా ప్రసాదించే శ్రీమత్త్రికోటేశ్వర సన్నిధానం కోటప్పకొండ మహాక్షేత్రం.
కోటప్పకొండ చరిత్ర:
దక్షయఙ్ఞ విధ్వంసానంతరం లయకారుడైన శంకరుడు శాంతివహించి యోగనిష్ఠతో 12 సం|| వటువుగా దక్షిణామూర్తి అవతారంలో సకల దేవతలతో కూడి ఈ త్రికూటాద్రిపై నివసిస్తూ మధ్యమ శిఖరమైన "రుధ్రశిఖరమున బిల్వవనాంతర్గత వటవృక్షము క్రింద బ్రహ్మాసన స్ధితుడై, బ్రహ్మ విష్ణ్వాది సకల దేవతలకు, సనకసనందనాది పరమహంసలకు, నారదాది దేవర్షులకు వాలఖాల్యాదియోగ సిద్ధులకు, వశిష్ఠాది మహర్షులకు, మేధాది రాజవర్యులకు బ్రహ్మొపదేశమిచ్చిన ప్రదేశము, దివ్యపుణ్యధామము రుధ్రశిఖరము. ఇట మహాదేవుడు దక్షిణామూర్తి రూపంతో సమస్త దేవతలు సేవించి తరింప చిన్ముద్రధారుడై దర్శనమిచ్చెనని భక్తుల విశ్వాసం. యిదియే ప్రాచీన కోటేశ్వవరాలయం. ఇదియే పాత కోటప్ప గుడి.
రుద్రశిఖరానికి ఈశాన్య భాగాన ఓ శిఖరము గలదు. ఇదియే "గద్దలబోడు" లేక విష్ణుశిఖరం. దక్షాధ్వర సమయంలో శివరహితంగా తాము భుజించిన హవిర్భాగ దోష నివారణార్ధమై ఇంద్రాది దేవతలతో కూడి మహావిష్ణువు పరమేశ్వర సాక్షాత్కారానికై తప మాచరించగా ఈశ్వరుడు ప్రత్యక్షం కాగా తాము ఎల్లవేళలా అర్చించుకొనుటకు లింగరూపంతో ఈ శిఖరంపై నిలచి దర్శనమీయమని ప్రార్ధింప పరమేశ్వరుడు సమ్మతించి త్రిశూలంతో రాతిపై పొడిచి ఉదక ముధ్భవింపజేసి లింగరూపధారియై ఈ జలమందు స్నానమాచరించి నన్ను పూజించిన మీ పాపములు వినాశమగునని యానతిచ్చి అంతర్ధానుడయ్యాడు. ఆనంద పరవశులైన యింద్రాది దేవతలు ఈ జలమున స్నానమాడి పాప వినాశనులైరి. అందువలన ఈ జలమునకు "పాపనాశన తీర్ధ" మని ఈ క్షేత్రమునకు "పాపవినాశన క్షేత్ర" మని లింగమునకు "పాపవినాశనలింగ" మని పేరు వచ్చింది. భక్తులు ప్రధమతహా నీ దివ్య స్థలాన్ని దర్శించి "ద్రోణిక" దొనయందు స్నానమాడి పవిత్రులై పాపనాశన లింగాన్ని పూజించి పిదప కోటేశ్వరుని దర్శించి తరించుట ప్రశస్తంగా రూపొందించబడినది. యింద్రాది దేవతలు సిద్ధ సాధ్యులు, గరుడ గంధర్వులు ఎల్లవేళలా ఈ శిఖరమున వసింతురని విశ్వాసము. కార్తీక, మాఘ మాసములందు పాపనాశమున స్నానమాచరించి లింగార్చన చేసిన వారికి భోగమోక్షములు సిద్ధించునని ప్రతీతి. రుద్రశిఖరమునకు నైరృతీభాగమున బ్రహ్మ యధిష్ఠించి యుండును. రుధ్ర, విష్ణు శిఖరముల యందు పూజనీయ లింగములుండి తన శిఖరమున లింగము లేకుండుటకు, బ్రహ్మ విచారించి ఈశ్వరుని గురించి తపమాచరింప మహేశుడు లింగరూపంలో వెలయడం జరిగింది. నేడు అర్చనల నందుచున్న మహిమాన్విత దివ్యరూపశిఖరము బ్రహ్మశిఖరము. నూతన కోటేశ్వరుడు లింగరూప ధారియై నేటికిని అశేష ప్రజల పూజలందుకొనుచూ భక్తవశంకరుడై దర్శనమిస్తున్నాడు. దీనినే నూతన కోటేశ్వర క్షేత్రంగా ఆరాధిస్తారు.
ఏ దయ వలన దుహాలన్నీ సంపూర్ణంగా నశించి శాశ్వతానంద కైవల్య సిద్ధి లభిస్తుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు .దీన్ని కల దైవమె దక్షిణా మూర్తి .ఆ దక్షిణా మూర్తి స్వరూపమే గుంటూరు జిల్లాలో ఉన్న కోటప్ప కొండ పై త్రికూటేశ్వర స్వామి .సర్వ సంపదలు ,మనశ్శాంతి ,సత్సంతానం ప్రాసాదించే వాడు త్రికూటేశ్వరుడు .త్రికూటేశ్వర నామ స్మరణమే మోక్షదాయకం అని అగస్త్య మహర్షి అభి వర్ణించాడు .నరసరావు పేట కు పద్నాలుగు కిలో మీటర్ల దూరం లో ఎల్ల మంద ,కొండ కావూరు మధ్య ఉన్న పర్వతాన్ని త్రికూటాచలం లేక కోటప్ప కొండఅంటారు.1857అడుగుల ఎత్తు ,1500ఎకరాల వైశాల్యం ,పన్నెండు కిలో మీటర్ల చుట్టుకొలత ఉండి కోటి ప్రభా భాసమానమైన దివ్య విరాజిత క్షేత్రం కోటప్ప కొండ . ఏ వైపు నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి .అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతి రూపాలు .త్రిమూర్త్యాత్మక దక్షిణామూర్తి అవతారమే త్రికూటేశ్వర పరమేశ్వరుడు .దేవ ,మానవ సేవితమై ముక్తి దాయుడైన ఈ స్వామిని ఎల్లమందేశ్వరుడు ’కావూరి త్రికోటేశ్వరుడు ,కోటప్ప ,కోటయ్య అని భక్తితో పిలుచుకొంటారు ఇక్కడ ధ్వజస్తంభం, అమ్మవారు లేకపోవటం ,కల్యాణం జరక్క పోవటం ప్రత్యేకతలు .ఈ కొండపై కాకులు వాలక పోవటంవింతలలో వింత .ఈ కొరతను తీర్చటానికా అన్నట్లు కోతులు మాత్రం అసంఖ్యాకం.జాగ్రత్తగా ఉండక పొతే చేతిలోని వన్నీ హనుమార్పణమే .
త్రికూటేశ్వర ఆవిర్భావం:
దక్షయజ్న విధ్వంసం చేసి లయ కార శివుడు శాంతి పొంది యోగ నిష్ట తో పన్నెండేళ్ళ వటువుగాదక్షిణా మూర్తి గా త్రికోటాద్రి పై ఉంటూ మధ్య శిఖరమైన రుద్ర శిఖరాన బిల్వ వనం లో వట వృక్షం కింద బ్రహ్మాసనస్తితుడై దేవ ,ముని యక్ష కిన్నరాదులచే సేవింప బడుతున్నాడు .రుద్ర శిఖరానికి ఈశాన్యం లో ఒక శిఖరం ఉంది .దాన్ని గద్దల బోడు అంటారు బోడుఅంటే శిఖరం .శివుడిని ఆహ్వానించ కుండా దక్షుడు చేసిన యజ్ఞానికి తాము హాజరైన హవిర్భాగాన్ని తినటం వలన కలిగిన దోషాన్ని విష్ణువు మొదలైన దేవతలు నివా రించుకోవటానికి ఇక్కడ శివునికో సం తపస్సు చేశాడు .శివుడు మెచ్చి దర్శనమిచ్చి తన త్రిశూలం తో శిఖరాన్ని పొడిచి జలాన్ని ఉద్భవింప జేసి తాను వారి అభ్యర్ధన మేరకు అక్కడే ఉండిపోయి అనుగ్రహించాడు .ఆ శివజాలం లో సస్నానం చేసి విష్ణువు మున్నగు దేవతలు పాప విముక్తులయ్యారు .ఈ జలాన్ని పాప వినాశనతీర్ధమని ,ఈ శివుని పాప వినాశక లింగ మూర్తి అని అంటారు .కార్తీక ,మాఘ మాసాలలో ఇక్కడి జలం లో స్నానించి ఈ శివుని దర్శిస్తే మోక్షమే . సోపాన మార్గాలు
ఇంతటి దివ్య మహిమ కలిగిన త్రికూటాచలాన్ని ఎక్కటానికి మూడు దారులున్నాయి .పాప వినాశన స్వామి గుడీ పడమరగా ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కి చేరచ్చు .ఇదే ఏనుగుల బాట లేక ఎల్ల మంద సోపానం .దీనిని శ్రీ మల్రాజు నరసింహరాయణి నిర్మింప జేశారు .
ఆలయ పునర్నిర్మాణం:
శ్రీ శృంగేరి పీఠాదిపతులు శ్రీశ్రీ భారతీ మహా తీర్ధ స్వామి వారు డెబ్భై లక్షల ఖర్చుతో ఆగమ విధానం లో కోటప్ప కొండఆలయ పునర్నిర్మాణం జరిగింది .
స్థల పురాణ విశేషాలు:
త్రికూట పర్వతాలలో మధ్యమ శిఖరం పై శ్రీ కోటేశ్వర లింగం ఉంది .కొత్త ఆలయం దక్షిణ భాగం లో గణనాధుని గుడి ,పడమర సాలంకేశ్వరాలయం ఉత్తరాన సంతాన కోటేశ్వర లింగం ,ఎడమ బాగాన బిల్వ వృక్షం కింద మార్కండేయ లింగం ,తూర్పు మండపం లో నందీశ్వరుడు ,దీనికి తూర్పున అడవి రామ లింగం ,వెనక లింగ మూర్తి తూర్పున దుర్గా, భైరవులు ,గర్భాలయం లో ద్వార పాలురు ఉంటారు .సోపాన మార్గ ప్రారంభం లో కింద తలనీలాలను సమర్పించే ప్రదేశాన్ని బొచ్చు కోటయ్య గుడి అంటారు .కొండ కింద నీల కంఠేశ్వర స్వామి ,దీనికి నైరుతిన వాసు దేవానంద సరస్వతి స్వాముల వారు కాశీ నుంచి తెచ్చిన శివలింగం ఉన్నాయి.ఈ క్షేత్రం లో దైవ నిర్మితమైన దోనెలు ఎన్నో ఉన్నాయి .దిగువ దోనేలలో ఎద్దడుగు దోన ,పుర్ర చేతి దోన ,ఉబ్బు లింగయ్య దోన ,పాలదోన ,లో భక్తులు స్నానాలు చేస్తారు .ఇక్కడే తపస్సు చేసుకోవటానికి ఎన్నో గుహలు అనుకూలం గా ఉన్నాయి .త్రికూటానికి దక్షిణాన ఒగేరు లేక ఓంకార నది ప్రవహిస్తోంది .చేజెర్ల లో శిబి చక్ర వర్తి లింగైక్యం చెందిన కోటేశ్వర లింగానికి సమస్త దేవతలు ,సిద్ధ సాధ్యాదాదులు మహర్షులు ఓంకారం తో అభిషేకించిన జలం కపోతేశ్వర స్వామి గుడి వెనక నుండి బయల్దేరి కోటప్ప కొండ దగ్గర ప్రవహించి సముద్రం లో కలుస్తుంది .భక్తులు ముందుగా విష్ణు శిఖరం లోని పాప వినాశన తీర్ధం లో స్నానం చేసి లింగ మూర్తిని పూజించి ,గొల్ల భామను దర్శించి తర్వాత త్రికూటేశ్వర లింగ దర్శనం చేయటం విధానం .శ్రావణ మాసం లో రుద్ర శఖరాన్ని కార్తీక మాసం లో విష్ణు శిఖరాన్ని ,మాఘం లో బ్రహ్మ శిఖరాన్ని దర్శించి మహా లింగార్చన చేసి ప్రాచీన ,నూతన కోటేశ్వర స్వాముల దర్శనం చేసి తరించాలి .కోటప్ప కొండ అపర కైలాసం అని అచంచల విశ్వాసం .
చరిత్ర ప్రసిద్ధి:
కోటప్ప కొండ దేవుడికి వెయ్యేళ్ళ పై బడి చరిత్ర ఉంది .ఇక్కడి దాన శాసనాలలో వెలనాటి గొంక రాజు ,వెలనాడు చాళుక్య భీమ రాజు ,వెలనాటి కులోత్తుంగ చోళుడు ,వెలనాటి రాజేంద్రుడు పేర్లున్నాయి .కృష్ణ దేవరాయలు ,మల్రాజు వెంకట నారాయణి ,వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మొదలైన రాజులు జమీందార్లు స్వామికి విలువైన మాన్యాలు రాసి సమర్పించారు .
త్రికూటాచల మహాత్మ్యం:
ఎల్లమంద గ్రామానికి చెందిన ఎల్ల ముని మంద లింగ బలిజ కులానికి చెందిన మహా భక్తుడు .అడివికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్మి జీవించేవాడు .ఒక రోజు మధ్యమ లింగాన్ని పూజించి ,మర్నాడు తమ్ములతో విష్ణు శిఖరాన్ని చేర గా కుండపోతగా గాలీ వర్షం కురిసింది .దగ్గరలోని గుహలో తల దాచుకొన్నారు .అక్కడ ఒక ధనం ఉన్న బిందె అనిపించింది .దాన్ని తీసుకొని సాలంకయ్య రుద్ర శిఖరం లో ఒక జంగమయ్య ప్రత్యక్షం కాగా ఆయన్ను రోజూ పూజించే వాడు .కొద్ది కాలం తర్వాత జంగమయ్య అదృశ్యమైనాడు .సాలంకయ్య వేదన చెంది వెదికి వేసారి నిరాహార దీక్ష చేసి బ్రహ్మ శిఖరం చేరి ఆక్కడున్న గొల్లభాము తన బాధ తెలిపుదామని వెతికితే ఆమెకూడా కనిపించలేదు . బ్రహ్మ శిఖరం లో ఒక గుహను చేరగానే నేను నీవిందు ఆరగించాను .నీ వాడిని .పరమేశ్వరుడిని .గొల్లభాము మోక్షమిచ్చాను .నేనిక్కడే ఉంటాను .ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టించు .త్రికూటేశ్వర లింగ రూపం లో అర్చించు .మహా శివ రాత్రి నాడు ఓంకార నదిలో స్నానం చేసి నన్ను అభిషేకించాలి .జాగరణ చేసి ప్రభలను కట్టి వీరంగం మొదలైన వాయిద్యాలతో మర్నాడు అన్నదానం చేయాలి .అప్పుడు నువ్వు శివైక్క్యం చెందుతావుఅని చెప్పి జంగమ దేవర అదృశ్యమైనాడు .
సాలంకుడు యోగి ఆదేశం తో గుడికట్టించి ,త్రికూటేశ్వర లింగాన్ని ప్రతిష్టించి గొల్ల భామకు(ఆనంద వల్లి ) వేరుగా గుడి కట్టించి భక్తితో పూజించాడు పడమర మరో ఆలయం కట్టించి అక్కడ శివ పార్వతీ కళ్యాణ మహోత్సవాలు చేయాలని భావించాడు అప్పుడు దివ్య వాణి ఇది బ్రహ్మ చారి దక్షిణామూర్తి క్షేత్రం. ఇక్కడ కళ్యాణాలు నిషిద్ధం అని విని పించింది .సాలంకుడు ప్రతిష్ట కోసం తయారు చేయించిన పార్వతీ విగ్రహం మాయ మైంది .విరక్తి చెందిన సాలముడు దేహ త్యాగం చేయ నిశ్చయించి యోగబలం తో లింగైక్యంచెందాడు .అతని తమ్ములు కూడా లింగైక్యం చెందారు . వీరు బ్రహ్మ ,విష్ణు ,మహేశ్వర లింగాలుగా ,సాలంకయ్య సాలంకేశ్వరుడు గా ఆయన ప్రతిష్టించిన లింగం కోటేశ్వర లింగం గా బ్రహ్మ శిఖరాన వెలిసి ఈ క్షేత్రం పంచ బ్రహ్మ స్థాన క్షేత్రం గా పేరు పొందింది .
ఆనంద వల్లి (గొల్లభామ ):
త్రికూటాచల దక్షిణాన కొండ కావూరు గ్రామం లో యాదవ వంశం లో సుందరి సునందలకు గారాల బిడ్డగా ఆనంద వల్లి జన్మించింది .చిన్న నాటి నుంచే శివ భక్తిలో లీన మయ్యేది .రుద్రాక్షమాలలు ధరించేది .ఆధ్యత్మిక భావాలను బోధించేది .ఒక శివ రాత్రి నాడు ఆమె ఓంకార నదిలో స్నానం చేసి రుద్ర శిఖరం చేరి త్రికూటేశ్వరుని దర్శించి ,బిల్వ వృక్షం కింద తపస్సులో ఉండగా ,సాలంకయ్య కు దర్శన మిచ్చిన జంగమయ్య కు ఆవుపాలు ఇచ్చి మిగిలింది తను తాగుతూ శివ నామ స్మరణం తో గడిపేది .సాలంకయ్యకు జంగమ స్వామి కనపడక తిరుగుతూ గొల్లభామ దగ్గరకు వచ్చి తన మనవిని జంగమ స్వామికి తెలియ జేయమని వేడుకొన్నాడు .గొల్లభామ దీక్షతో శివార్చన చేసేది .ఒకరోజు నెత్తిన తీర్ధ జలాన్ని పెట్టుకొని శ్రమతో జంగమయ్య ను దర్శించినప్పుడు ఒక కాకి నెత్తిమీది కలశం పై వాలగా పాలు నేల పాలయ్యాయి .కోపించిన ఆనంద వల్లి ఈ రోజు నుండి ఈ కొండపై కాకులు వాల కుండా ఉండుగాక అని శపించింది .ఆమె భక్తీ కి సంతసించి జంగమయ్య ప్రత్యక్షమై శివైక్యాన్ని ప్రసాదించాడు.
విశిష్ట సేవా విధానం:
శ్రీ త్రికూటేశ్వరాలయం లో .ఎప్పుడూ అఖండ దీపారాధన ,అభిషేకాలు పూజలు జరుగుతాయి .శివ రాత్రి ఉత్సవానికి ఇక్కడికి కుల మత భాషా ప్రాంత భేదాలు లేఉండా అశేష జనం వస్తారు .మహా ఎత్తైన ప్రభలు కట్టుకొని రావటం ఇక్కడ ప్రత్యేకత . అందుకే ఏదైనా ఎత్తుగా ఉంటె కోటప్ప కొండ ప్రభ అఅనటం అలవాటైంది .మాఘ మాసం లో పశువులతో ప్రదక్షిణ చేసి స్వామిని సేవిస్తారు .తడి బట్టలతో చిన్న చిన్న ప్రభలను భుజాన పెట్టుకొని గరి నెక్కిప్రదక్షిణ చేస్తారు .సంతాన హీనులు ,భూత ప్రేత పిశాచాదుల బారిన పడిన వారు నేత్ర ద్రుష్టి కోల్పోయిన వారు కోటేశ్వర స్వామి ప్రదక్షిణ చేసి దర్శించి మనోభీస్టాన్ని నేర వేర్చుకొంటారు .
కోటి ప్రభల కోటేశ్వరుడు:
కొండ కింద ప్రసన్న కోటేశ్వరుడు నీల కంఠేశ్వరుడు మొదలైన ఆలయాలున్నాయి .అన్నదాన సత్రాలున్నాయి .శివరాత్రికి అన్నికులాల వారికి అన్నదానం జరుగుతుంది .శివ రాత్రి తిరునాళ్ళు పరమ వైభవం గా నిర్వహింప బడుతాయి .నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి .శివరాత్రి నాడు లింగోద్భవ సమయం లో కోటిన్నోక్క ప్రభలతో నా కొండకు వచ్చే భక్తుల కోసం నేను కొండ దిగి వచ్చి దర్శనం అనుగ్రహిస్తాను అని కోటేశ్వరుడు అభ్యమిచ్చినట్లు భక్తులు విశ్వసిస్తారు .శివుడికి ఇష్టమైన వెదురు గడలతో ప్రభలను నిర్మించి ,అనేక చిత్ర విచిత్ర పటాలను అలంకరించి విద్యుద్దీపాలతో వెలుగులు వెలయింప జేస్తూ కోటప్ప కొండకు తిరునాళ్ళకు వస్తారు .కాని ఇన్నేళ్ళుగా ప్రభలు కట్టినా కోటి న్నొక ప్రభ సంఖ్య కాలేదట ఎప్పటికప్పుడు ఒక ప్రభ తగ్గుతోందట .ఆ లేక పూర్తీ అయితే ప్రళయం వచ్చి స్వామి ఇందికి దిగివస్తాడని నమ్ముతున్నారు .చేదుకో కోటేశ్వరా ,చేదుకొని మమ్మాదరించవయ్యా అని భక్తీ తో ఆర్తితో వేడుకొంటూ హరహర మహాదేవ స్మరణతో దిక్కులు పిక్కటిల్లిపోతాయి .ఎడ్ల పందాలు ,చిత్రమైన ఆటలు కోలాటాలు నృత్య గీతాలతో ,రంగుల రాట్నాలతో ప్రాంగణం అంతాశోభాయమానం గా కనిపిస్తుంది పశువులతో గిరి ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకొనే అశేష జన సమూహం ఉత్సాహాన్నిస్తుంది .శివరాత్రి వేడుకల తో బాటు కార్తీక ,మార్గ శిర మాఘ మాసాలలో భక్తులు సామూహిక బిల్వార్చన ,రుద్రాభిషేం ,రుద్రయాగం జరగటం ఇక్కడి విశేషం .
లింగ ప్రాధాన్యం:
సంతానం అపేక్షించేవారు శుచిగా తడి బట్టలతో సంతాన కోటేశ్వర లింగం కు ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారు.లింగోద్భవ కాలం లో అర్ధ రాత్రి వరకు తడి బట్టలతోనే శివ పంచాక్షరి జపిస్తూ గడగడ లాడే చలిలో కూడా ఆలయం చుట్టూ సాష్టాంగ దండ ప్రమాణాలు చేయటం వారి మహా భక్తికి విశ్వాసానికి నమ్మకానికి నిదర్శనం .కొత్త కోటేశ్వరాలయం పైన ఉన్న సెల యేరు దగ్గరున్న మార్కండేయ మహా ముని చేత ప్రతిష్టింపబడిన మార్కండేయ శివ లింగం ఉంది . కైలాసం నుండి సతీవియోగ వికల మనస్కుడై ఇక్కడికి వచ్చి దక్షిణా మూర్తి గా వెలసిన శివుని వెతుక్కొంటూ ఆయన వాహనమైన బసవన్న ఇకడికి వచ్చి ఘోర తపస్సు చేశాడు .ఆయన అమోఘ తపస్సుకు భంగం కాకుండా పరమేశ్వరుడు ఇక్కడ తాగు నీటికోసం ఒక వాగును ప్రవహింప జేశాడు .అదే ఎద్దడుగు వాగు అని పిలువ బడుతోంది .త్రికోటేశుని సన్నిధిలోని బసవ మందిరం భక్తులు శివరాత్రి మొదలైన పర్వ దినాలలో పూజలు ,వ్రతాలు ఆచరిస్తారు .ఇక్కడి అసలు దైవం బ్రహ్మ చారి అయిన దక్షిణా మూర్తి కనుక ధ్వజస్తంభ ప్రతిష్ట లేదు .కళ్యాణ వైభోగం లేదు అందుకే స్వామిని బాల కోటేశ్వరుడు అని సంతాన కోటేశ్వరుడు అని అంటారు .
అడవి రామ లింగేశ్వరుడు ,కూకట్ల శంభుడు ,శంభు లింగమ్మ ,నాగమ్మ , వెంకటేశ్వరుడు అనే భక్తులు స్వామిని సేవించి పునీతులైనారు .200ఏళ్ళ నుండి ప్రభలతో మొక్కులు సమర్పించటం ఉన్నదని తెలుస్తోంది .పొట్లూరి గ్రామం నంది వాహనం పై శివుని అలమరించి శివరాత్రి జాగరణ నాడు ప్రభలతో ఆ గ్రామ ప్రజలు అన్ని మెట్లు యెక్కిస్వామిని దర్శించటం ఇప్పటికీ ఆన వాయితిగా వస్తోంది .ఇక్కడి ప్రభలు ఈశ్వరుని క్రాంతి ప్రభలకు నిదర్శనం .ఆహ్లాదానికి ,ఔన్నత్యానికి సమైక్యతకూ ప్రతీక .40అడుగుల నుండి 100అడుగుల ఎత్తు వరకు ప్రభలు వాటిపై విద్యుత్ కాంతులతో నిర్మించటం విశేషాలలో విశేషం .అమావాస్య నాడు పున్నమి సందర్శనాన్ని తలపింప జేస్తుంది .
దక్షిణా మూర్తి దీక్ష:
ధనుర్మాసం లో ఆర్ద్రా నక్షత్ర ఉత్సవానికి ముందు నలభై రోజుల పాటు వేలాది భక్తులు శ్రీ మేధా దక్షిణా మూర్తి దీక్షను స్వీకరిస్తారు .దీనికే కోటప్ప దీక్ష అని పేరు .నియమ నిష్టలతో భక్తీ విశ్వాసాలతో శివనామ స్మరణ శివ పంచాక్షరీ జపాల తో అభిషేకాలతో సంత్సంఘాలతో ఉపవాసాలతో ఆలయం పులకించిపోతుంది దక్షినానన దక్షినానన దక్షినానన పాహిమాం –త్రికోటేశ్వర త్రికోటేశ్వర త్రికోటేశ్వర రక్షమాం అని శివ స్మరణ చేస్తూ ఆలయం అపర కైలాసాన్ని స్పురణ కు తెస్తుంది .మేధా దక్షిణా మూర్తి భక్త సమాజం వారు 46 రోజుల పాటు 35 మంది వేద పండితులతో మహా రుద్ర యాగ పూర్వా కోటి బిల్వార్చన,నిరతాన్న దానాలు ,గోస్టులు , సాంస్కృతిక కార్యకలాపాలతో కళకళ లాడుతుంది ప్రాంగణం అంతా .కోరిన కోర్కేలనుతీర్చేకోటప్ప కొండ త్రికోటేశ్వర స్వామి ని దర్శించి తరిద్దాం .
శివః కారయితాకర్తా-శివో భోజయితా భోక్తా శివః -ప్రీణాతు శంకరః :
గుంటూరు జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో కోటప్పకొండ ఒకటి. కోటప్పకొండలోని శివుణ్ణి త్రికూటేశ్వరస్వామి అని, దేవాలయాన్ని త్రికూటేశ్వరాలయం అని పిలుస్తారు. గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో కోటప్పకొండను భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే వుంటారు. ఈ దేవాలయంలో 687 అడుగుల ఎత్తు వుండే శివుడి విగ్రహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కోటప్పకొండ ప్రాంతం మొత్తం శిఖరాల మయం. దేవాలయం దగ్గర నిలుచుంటే చుట్టూ రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం అనే మూడు పెద్దపెద్ద శిఖరాలు కనిపిస్తాయి. కోటప్పకొండ కంటే ఎత్తున వుండే రుద్ర శిఖరం మీద ఒక చిన్న దేవాలయం కూడా వుంటుంది. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ళ సందర్భంగా ఏర్పాటయ్యే ఎత్తయిన ప్రభలు చాలా ప్రసిద్ధిని పొందాయి. కార్తీకమాసంలోనే ఈ దేవాలయంలో కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతూ వుంటాయి. కొండమీద వున్న దేవాలయాన్ని చేరుకోవడానికి మెట్ల మార్గం వుంది. మెట్లు చాలా నిట్టనిలువుగా వుంటాయి. అందుకే కొండకు ఎక్కే భక్తులు ‘చేదుకో కోటయ్యా’ అని అంటూ ఎక్కుతూ వుంటారు. బస్సు మార్గం వున్నప్పటికీ చాలామంది భక్తులు నడిచే కొండమీదకి వెళ్తూ వుంటారు. ఈ కోటప్పకొండ క్షేత్రానికి వున్న మరో విశిష్టత ఏమిటంటే, ఈ క్షేత్రం వున్న కొండ మీద కాకులు అస్సలు కనిపించవు. మిగతా పక్షులన్నీ కనిపిస్తాయిగానీ, ఎంత వెతికినా ఒక్క కాకి కూడా కనిపించదు. ఇదొక వింత. ఓ సందర్భంలో కాకి ఈ కొండమీదకి రాకుండా శాపం విధించారనే స్థల పురాణం ప్రచారంలో వుంది. 1761లో ఈ ప్రాంతాన్ని పాలించిన గుండారాయలు అనే రాజు కోటప్పకొండ మీదకి 703 మెట్లతో మెట్లమార్గాన్ని ఏర్పాటు చేయించారు.
