అష్టలక్ష్మి స్తోత్రము

అష్టలక్ష్మి స్తోత్రము

bookmark

అష్టలక్ష్మి స్తోత్రము:

శ్రీ మహాలక్ష్మీ మంత్రము అష్టలక్ష్మీ స్తోత్రము లందిమిడియున్నది, గాన అద్దానిని ప్రతిదినము పఠించు వారలకు అష్టైశ్వర్యములు, సకల ఆయురారోగ్యములు కలుగును, ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, స్వరూపిణియైన శ్రీ మహాలక్ష్మి దేవిని ఈ స్తోత్రముచే పారాయణ చేయువారు దేవి కృపకు పాత్రులగుదురు.

ఆదిలక్ష్మి:
సుమనస వందిత సుందరి మాధవి
చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని
మంజుల భాషిణి వేదమతే |
పంకజవాసిని దేవ సుపూజిత
సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని
ఆదిలక్ష్మి పరి పాలయమాం ||

ధాన్యలక్ష్మి:
ఆయికలి కల్మష నాశిని కామిని
వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి
మంత్రనివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని
దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధాన్యలక్ష్మి పరిపాలయమాం ||

ధైర్యలక్ష్మి:
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి
మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద
జ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని
సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని
ధైర్యలక్ష్మీ పరి పాలయమాం ||

గజలక్ష్మి:
జయ జయ దుర్గతి నాశిని కామిని
సర్వ ఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగ పదాతి సమావృత
పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత
తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని
గజలక్ష్మీ రూపేణ పాలయమాం ||

సంతానలక్ష్మి:
అయిగజ వాహిని మోహిని చక్రణి
రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి
సప్తస్వర భూషిత గాన నుతే
సకల సురాసుర దేవ మునీశ్వర
మానవ వందిత పాదయుగే
జయ జయహే మధుసూదన కామిని
సంతానలక్ష్మీ పరిపాలయమాం

విజయలక్ష్మి:
జయ కమలాసిని సద్గతి దాయిని
జ్ఞాన వికాసని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర
భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత
శంకర దేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని
విజయలక్ష్మీ పరిపాలయమాం

విద్యాలక్ష్మి:
ప్రణత సురేశ్వరి భారత భార్గవి
శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ
శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి
కామిత ఫలప్రద హాస్యయుతే
జయ జయహే మధుసూదన కామిని
విద్యాలక్ష్మీ పరిపాలయమాం

ధనలక్ష్మి:
ధిమి ధిమి ధింధిమి ధింధిమి
దుంధుభి నాద పూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ
శంఖ నినాద సువాద్యమతే
వేద పూరాణేతిహాస సుపూజిత
వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని
ధనలక్ష్మి రూపేణా పాలయమాం ||

ఫలశృతి:
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం |
వరదే | కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే |
భక్త మోక్ష ప్రదాయిని
శ్లో|| శంఖ చక్రగదాయక్తే
విశ్వరూపిణితే || జయః ||
జగన్మాత్రేచ మోహిన్యై
మంగళం శుభ మంగళం.

సౌభాగ్యలక్ష్మి రావమ్మా... అమ్మా...
నుదుట కుంకుమ రవిబింబముగ, కన్నులనిండుగ,
కాటుగ వెలుగ, కాంచనహారము గళమున
మెరయగ పీతాంబరముల శోభలు నిండగ ||సౌ||
నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు
పాదమ్ముల మువ్వలు, గల గల గలమని సవ్వడి
జేయగ సౌభాగ్యవతుల సేవలనందగ ||సౌ||
నిత్య సుమంగళి, నిత్య కళ్యాణి భక్త జనుల
మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండ
గా కనకవృష్టి కురిపించే తల్లి ||సౌ||
రమణీ మణివై, సాధు సజ్జనుల పూజలందుకొని
శుభములనిచ్చెడి దీవనలీయగ ||సౌ||
కుంకుమ శోభిత, పంకజలోచని, వెంకట
రమణుని పట్టపురాణి, పుష్కలముగ
సౌభాగ్యములిచ్చె పుణ్యమూర్తి మాఇంటవెలసిన ||సౌ||
సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురంధర విఠలుని
పట్టపురాణి, శుక్రవారము పూజలనందగ
సాయంకాలము శుభ ఘడియలలో ||సౌ||