అన్ని దానముల కన్న అన్నదానం మిన్న

అన్ని దానముల కన్న అన్నదానం మిన్న

bookmark

"అన్ని దానముల కన్న అన్నదానం మిన్న:

“అన్నం పరబ్రహ్మ స్వరూపం” భూమిఫై జీవించే కొన్ని కోట్ల రకాల జీవరాసులుకు  మరియు అందులో మొదటి స్థానం సంపాదించుకున్న మానవవులుకు  ఏది లోపించినా బ్రతకగలం కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేము .
“అన్ని దానాలకన్న అన్న దానం మిన్న” అని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే  బంగారం ,డబ్బు ,పదవి ,భూమి ,కార్లు ,బంగళాలు  ఇలా ఏది దానంగా ఇచ్చినా  ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది కానీ వారిలో తృప్తి ఉండదు ఒక్క అన్నదానం చేస్తే మాత్రం తీసుకున్నవారు  కడుపు నిండినది ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు.

ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు .

అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టె ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందుల నుండి , ఇక్కట్ల నుండి బయటపడటానికి చక్కటి పరిహారంగా ఈ  అన్నదానం అని పురాణాలు చెబుతున్నాయి. అన్నదానం వలన ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయని చెప్తారు.
అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి.
కొందరు ఆర్దికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎంత కష్టపడినా సరైన ఫలితం లేకపోవడం .

దీనికి తోడు విపరీతమైన ఖర్చులతో బాధ పడుతున్నవారు అన్నదానం చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగడమే కాకుండా  అనారోగ్యంతో భాదపడుతున్నవారు, ధీర్ఘ రోగాలతో ఉన్నవారు వారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు.

భోజనం చేసేముందు మొదటి ముద్దను “పరమేశ్వరార్పణం” చేసి దానిని కాకులకో, ఇతర పక్షులకో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడం వలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది.
ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు పెట్టడం  వలన  ఏలనాటి శని ,అర్థ అష్టమ శని, శనిమహర్దశ ఉన్నవారు ఈ  దోషాల నుంచి ఉపసమనం పొందవచ్చు .

ప్రతినిత్యం చెయ్యలేకపోయిన మీకు సంబందించిన ముఖ్యమైన రోజులలోనైన మీ ఆర్ధిక స్తోమత బట్టి అన్నదానం చెయ్యడం వలన మీ జీవితంలో మంచి జరుగుతుంది.

Ø  మీ పుట్టిన రోజు
Ø  పెళ్లిరోజు
Ø  గృహప్రవేశం
Ø  పెద్దలకు పెట్టే సంవత్సరికం రోజున
Ø  ఇంట్లో శుభకార్యం జరిగే రోజున
Ø  కొత్తగా ఉద్యోగం చేరే రోజున
Ø  పదవీ విరమణ రోజున

మన దేశంలో ప్రతిరోజు కొన్ని వేలమంది అన్నం లేకుండా ఆకలితో మరణిస్తున్నారు వీరిలో ముఖ్యంగా చిన్న పిల్లలు ,వృద్దులు అధిక శాతంగా ఉన్నారు.
కాబట్టి అన్నివున్నవారికి పెట్టడం కన్నా నిజంగా ఆకలితో ఉన్నవారని గుర్తించి పట్టెడు అన్నం పెట్టడం వలన మంచి ఫలితాలుంటాయి ."