అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు చూడుమా
"అటమటమయ్యె నా భజన మంతయు భూవర! నేఁడు చూడుమా
యిటువలె గారవించు జగదీశుఁడు గృష్ణుఁడు లేని పిమ్మటన్
బటుతర దేహలోభమునఁ బ్రాణము లున్నవి వెంటఁ బోక నేఁ
గటకట! పూర్వజన్మమునఁ గర్మము లెట్టివి చేసినాఁడనో?"

