89,క్రైస్తవమొక మతము కాదిది

89,క్రైస్తవమొక మతము కాదిది

bookmark

క్రైస్తవమొక మతము కాదిది
యేసునందు తిరిగి జన్మము
క్రీస్తునందు తిరిగి జన్మము (2)

1.ధరల తల్లి దానమొసగును
తన రక్తము ప్రతిజనలములో
అందరికి జీవమొసగెను
కలువరిలో యేసు రక్తము (2)
కలువరిలో యేసు రక్తము   ||క్రైస్తవమొక||

2.ఒక జన్మకు రెండు చావులు
ఇరు జన్మలకొక్క మరణమే (2)
సిలువయందే నరకపు చావు
పొందెనేసు అందరికొరకు (2)
పొందెనేసు అందరికొరకు  ||క్రైస్తవమొక||

3.భువికి మూలమీ శరీరము
దివిని చేర ఆత్మ మూలము (2)
మతము మార్గ జ్ఞానము వీడి
మరణ విజయుడేసు చేరుమా (2)
మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||