7,అందాల తార అరుదెంచి
అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్
ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలో
ఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని
1.విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెను
ఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమున
విశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్ ||అందాల||
2.యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్
యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు ||అందాల||
3.ప్రభు జన్మ స్థలము పాకయేగానీ పరలోక సాధమే
బాలుని జూడ జీవితమంత పావన మాయెను
ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించెపుణ్యము
బ్రతకే మందిరమాయె - అర్పణలే సిరులాయే ఫలించె ప్రార్ధన ||అందాల||
