57,ఏ తెగులూ నీ గుడారమున్
ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య
అపాయమేమియు రానేరాదు రానేరాదయ్యా
హల్లెలూయ స్తోత్రం...
హల్లెలూయ స్తోత్రం...
హల్లెలూయ స్తోత్రం...స్తోత్రం
ల ల్ల లా లా ల …….
1.ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని
ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి
2.గొఱ్ఱెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిమి
ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము
3.దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్ధము
కానేకావు కదలకుండా స్ధిరముగా ప్రయాసపడెదం
4.మన యొక్క నివాసము పరలోకమందున్నది
రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం
