54,ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో

54,ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో

bookmark

ఏ రీతి స్తుతియింతునో - ఏ రీతి సేవింతునో
నేరములెంచనివాడా - నాదు నజరేయుడా
తీరము దాటినవాడా - నాదు గలలీయుడా
అ.ప:  నా ప్రాణనాధుండా  - నీదు ప్రాణమిచ్చితివి
నేను నీవాడనో యేసువా

1.వెదకి నను ఇల చేరితివి - వెంబడింపగ పిలిచితివి
రోత బ్రతుకును మార్చితివి-నీదు సుతునిగా చేసితివి ||నా ప్రాణ||

2.మహిమ నగరిని వీడితివి - మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి - సేవకునిగా మారితివి ||నా ప్రాణ||

3.ఇంత ప్రేమకు కారణము - ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్నతరమా నీ ప్రేమా - సన్నుతించుచు పాడెదను ||నా ప్రాణ||