509,కట్టెలపై నీ శరీరం
కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసిన తనువు నమ్మిన కట్టె మిగిల్చింది కన్నీటి గాధ
1.దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన పోలిన నిన్ను చూసి పరితపించి పోవాలని
కన్న తండ్రినే మరచి కాటికెళ్లిపోవాలా
నిత్య జీవం విడచి నరకమెళ్ళిపోతావా||ఎన్ని||
2.ఆత్మ నాలో ఉన్నప్పుడే అందరు నిన్ను ప్రేమిస్తారు
ఆది కాస్త వెళ్లిపోతే ఎవరికి నీ అవసరముండదు
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరకి కనిపించకనే ఆత్మ వెళ్లిపోవును ||ఎన్ని||
