508,పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది

508,పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది

bookmark

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
గడ్డిలాంటిది నీ జీవితం వాడిపోతుంది
ఏ దినమైందనా ఏ కష్టమైనా 
రాలిపోతుంది నేస్తమా వాడిపోతుంది నేస్తమా 

1.పాలరాతిపైన నీవు నడచిన గానీ
పట్టు వస్త్రాలే నీవు తొడిగిన గానీ
అందలంపైన కూర్చున్నా గానీ
అందనంత స్థితిలో నీవున్నా గానీ
కన్ను మూయడం కాయం - నిన్నే మోయడం ఖాయం
కళ్ళు తెరుచుకో నేస్తమా-కలుసుకో యేసుని మిత్రమా

2.జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గానీ
డబ్బుతో కాలాన్ని గడిపిన గానీ
జ్ఞానం నిన్న తప్పించదు తెలుసా
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణం రాకముందే అది నిన్ను చేరకముందే 
పాపాలు విడువు నేస్తమా - ప్రభుని చేరు మిత్రమా