492,అన్నివేళలా ఆదరించెడి

492,అన్నివేళలా ఆదరించెడి

bookmark

అన్నివేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం
ఎన్ని తీరుల నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ ఋణం

1.పడిపోయియుండగా నను తిరిగి లేపితివి
స్థిరపరచి దీవించగా నీ కరము చాపితివి
పోగొట్టుకున్నదంత ఇచ్చితివి
రెట్టింపు శోభ మరల తెచ్చితివి

2.నిను వెంబడించగా శ్రమలెన్నో కలిగినా
సువార్త చాటించగా ఉన్నవన్నీ పోయినా
నూరంతల దీవెనలు పంపెదవు -
సమృద్ధితో నను నింపెదవు