490,ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను
ఐక్యపరచుమయ్యా - ఈ వధూవరులను
సౌఖ్యమిచ్చి కాయుము - నవదంపతులను
మధుర ప్రేమతో - మనసులు కలువ
హృదయసీమలే - ఒకటిగ నిలువ
నీ దీవెనలే పంపుమా
1.ఆనందముతోడ - దు:ఖమునే గెల్వ
చిరునవ్వు తోడ - కష్టములనోర్వ
సంసార నావను - సరిగా నడిపించ
నీవే సహాయవిూయుమా
2.ప్రార్ధనా జీవితము - సమాధానము
భక్తి విశ్వాసము - నీతి న్యాయము
నీవు చూపిన కనికరం - నీవు నేర్పిన సాత్వికం
అనుగ్రహించి నడిపించుమా
3.ఇహలోక భోగముపై - మనస్సుంచక
పరలోక భాగ్యముపై - లక్ష్యముంచగా
నీకెంతో ఇష్టులై - ధరలో నీ సాక్షులై
సాగే కృప దయచేయుమా
