485,జుంటె తేనె కన్నా తీయనిది

485,జుంటె తేనె కన్నా తీయనిది

bookmark

జుంటె తేనె కన్నా తీయనిది
వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నీది
యేసు నీ నామము

సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది
పండు వెన్నెల కన్నా నిర్మలమైనది
మంచు కొండల కన్నా చల్లనిది
యేసు నీ నామము

యేసూ అసాధ్యుడవు నీవు
మరణాన్ని జయించిన వీరుడవు
సర్వాన్నీ శాసించే యోధుడవు
నీకు సాటి లేరెవరు

రక్షకా నీవేగా మా బలము
దేవా మా దాగు స్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు
ప్రణమిల్లి మ్రొక్కెదము||జుంటె||

ఆకాశము కన్నా విశాలమైనది
విశ్వమంతటిలో వ్యాపించియున్నది
ఊహలకందని ఉన్నతమైనది
యేసు నీ నామము

లోకమంతటికి రక్షణ మార్గము
జనులందరిని బ్రతికించు జీవము
సర్వ కాలములో నివసించు సత్యము
యేసు నీ నామము||జుంటె||